రామలింగాపురంలో కన్నుల పండువగా జీవధ్వజ ప్రతిష్ఠ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజ యంత్ర పుణప్రతిష్ఠ, గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు.
కారేపల్లి, మే 09 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజ యంత్ర పుణప్రతిష్ఠ, గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహక కమిటీ, ప్రముఖ పురోహితుడు బ్రహ్మ రాజు అచ్యుత రామారావు శర్మతో కలిసి వేద పండితులు నాగసాయి శర్మ, కిరణ్ కుమార్ శర్మ, ఆదిత్య శర్మ, రాము శర్మ మూడు రోజులపాటు ప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యేక పూజలు శాస్త్రోతంగా నిర్వహించారు.

రామలింగాపురంలో కన్నుల పండువగా జీవధ్వజ ప్రతిష్ఠ
ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, కర్మణ, పుణ్యాహవచనం, గర్తన్యాసము, జీవధ్వజ యంత్రస్థాపన, ధ్వజస్తంభ, విగ్రహ ప్రతిష్ఠాపన, పూర్ణహుతి, మండప ఉద్వాసనలు, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు లింగం బంజార, రామలింగాపురం గ్రామస్తులతో పాటు సమీప గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రామలింగాపురంలో కన్నుల పండువగా జీవధ్వజ ప్రతిష్ఠ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

