ఎర్రుపాలెం, మార్చి 20 : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వేకటేశ్వర స్వామి వారి ఆలయ హుండి లెక్కింపును గురువారం చేపట్టారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఖమ్మం వేకటేశ్వర స్వామి దేవస్థానం ఈఓ కె.వేణుగోపాలాచార్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. 91 రోజులకు గాను 32 లక్షల 86 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఉప్పల శ్రీరామచంద్ర మూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, సూపరిండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.