మణుగూరు టౌన్/ ఇల్లెందు/ కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 26: దేశంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ ఐక్యవేదిక జాక్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణి ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మోడీ సర్కార్ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను హరించేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు.
మణుగూరులో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు నాగెల్లి వెంకటేశ్వర్లు, బంగారి పవన్‌కుమార్, దీశెట్టి రమేష్, మురళీకృష్ణ, మస్తాన్, వెంకటేశ్వర్లు, రమేష్‌నాయక్, శ్రీనివాస్, ప్రసాద్, సుధాకర్, రాజేష్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఇల్లెందు సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో ఎస్వోటు జీఎం రామస్వామికి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెంలో కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నిరసన తెలిపి కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు కాపు కృష్ణ, కూసన వీరభద్రం, వంగా వెంకట్, వీరస్వామి, త్యాగరాజన్, పీతాంబరం, రాజారావు పాల్గొన్నారు.
బూర్గంపహాడ్, నవంబర్ 26: కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ నాయకులు సారపాకలోని ఐటీసీ పీఎస్డీ కర్మాగారం ప్రధాన గేటు ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. జీవో కాపీలను దహనం చేశారు. అన్ని ట్రేడ్ యూనియన్లు పాల్గొన్న కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ విధానం వల్ల కార్మికులు 10 గంటలపాటు పని చేయాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు సానికొమ్మ శంకర్‌రెడ్డి, సింగమనేని ప్రసాద్, వెంకటేశ్వర్లు, జీవన్‌రెడ్డి, షేక్ అబ్దుల్ సలీం, పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు, నవంబర్ 26: కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం నిరసన తెలిపారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, 29 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్‌లు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మోహన్‌రావు, రాజు, విజయకుమార్, శ్రీకాంత్, వీరయ్య, లక్ష్మీనారాయణ, సంతోశ్, సరిత, భవాని, హెమ్లీ, అమీరున్నీసా, చాందిని తదితరులు పాల్గొన్నారు.