బలవర్థకమైన ఆహారం అందిస్తున్నాం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలులో మర్యాదపూర్వకంగా కలిసిన ఇక్రిశాట్ నంగియా కంపెనీ డాక్టర్ల బృందం సభ్యులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల స్థితిగతులు, భద్రగిరి మార్ట్ నెలకొల్పి పూర్తిస్థాయి ఆర్గానిక్ వస్తువులనే ప్రజలకు అందిస్తున్న తీరు గురించి పీవో వివరించారు.
- భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, జూలై 21: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలులో మర్యాదపూర్వకంగా కలిసిన ఇక్రిశాట్ నంగియా కంపెనీ డాక్టర్ల బృందం సభ్యులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల స్థితిగతులు, భద్రగిరి మార్ట్ నెలకొల్పి పూర్తిస్థాయి ఆర్గానిక్ వస్తువులనే ప్రజలకు అందిస్తున్న తీరు గురించి పీవో వివరించారు.
గిరిజన మహిళలు నాణ్యతతో తయారు చేస్తున్న మిల్లెట్ బిసెట్లు లండన్ వరకు ఆన్లైన్లో అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. మీ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్‌ను దుమ్ముగూడెం, చర్ల, అశ్వరావుపేట మండలాల్లోని జీపీఎస్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు అందించాలని సూచించారు. ఇక్రిశాట్ నంగియా కంపెనీ బృందం సభ్యులు మాట్లాడుతూ ఇక్రిశాట్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని ఏడు నుంచి పదేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషకాహారం అందించడానికి న్యూట్రిషన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించామని, రక్తహీనతతో ఉన్న చిన్నారులను గుర్తించి న్యూట్రిషన్ ఫుడ్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. చిన్నారులందరికీ బలవర్ధకమైన ఆహారం అందించేలా సూచనలిస్తామని పేర్కొన్నారు. డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి చందన, ఏడీఎంహెచ్‌వో సైదులు, ఇన్చార్జి ఎంఈవో రమ, ఇక్రిశాట్ నంగియా బృందం డాక్టర్లు మాసన్ స్వామికన్నా, రూపా బెనర్జీ, జూడి థామస్, అభినవ్ ఎంసీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

