గిరిజనుల జీవనోపాధికి ఐటీడీఏలు కృషి
ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి పెంపొందించడానికి ఐటీడీఏలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. గ్రూప్-1 శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన వారితో భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీడీఏ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు.
- గ్రూప్-1 శిక్షణ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షలో ఐటీడీఏ పీవో రాహుల్
- ఐటీడీఏ, గ్రంథాలయం, ఏరియా ఆసుపత్రిని సందర్శించిన బృందం
భద్రాచలం, ఏప్రిల్ 3: ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి పెంపొందించడానికి ఐటీడీఏలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. గ్రూప్-1 శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన వారితో భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీడీఏ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు.
ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో 35 వేల మంది విద్యనభ్యసిస్తున్నారని, వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో 15 మంది పాల్గొని పతకాలు సాధించారని పీవో తెలిపారు. ఉద్దీపకం వర్క్‌బుక్‌ను తీసుకొచ్చి ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 95 శాతం ఉత్తీర్ణత సాధించామని, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ద్వారా వివిధ శాఖల అధికారులతో అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులలో చాలా వరకు మార్పు వచ్చిందన్నారు. 1970 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలు అందజేశామని పేర్కొన్నారు.
అనంతరం గ్రూప్-1 శిక్షణ సభ్యుల బృందం ఏరియా ఆస్పత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆస్పత్రి పర్యవేక్షకుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు, నీట్, జేఈఈ, గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై సలహాలు సూచనలు అందించారు. డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, మధుకర్, ఆర్సీవో గురుకులం అరుణకుమారి, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, ఏపీవో పవర్ వేణు, ఏవో రాంబాబు, డీఎం జీసీసీ సమ్మయ్య, ఏటీడీవో చంద్రమోహన్, జేడీఎం హరికృష్ణ, డీఎస్వో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

