చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించండి
మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
- విద్యార్థుల సన్మాన సభలో ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, మే 27 : మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు చదివి అత్యుత్తమ మారులు సాధించిన విద్యార్థులను భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం సన్మానించారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో చదివి, మంచి మార్కులు సాధించి రాష్ట్రంలోనే జిల్లాకు పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు ఎంసెట్, నీట్, జేఈఈ, ఇతర గ్రూప్స్ రాయడానికి ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ చదివిన పిల్లలు బీటెక్, ఎంబీబీఎస్ కోర్సులు చేయడానికి ఉపకరిస్తాయన్నారు. 550 మార్కులకు పైగా సాధించిన వారితోపాటు జేఈఈ మెయిన్స్‌లో విజయం సాధించిన ఐదుగురు, ఎప్‌సెట్‌లో ఇంజినీరింగ్ సీట్లు సాధించిన నలుగురిని ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఆర్సీవో గురుకులం అరుణకుమారి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అశోక్, విజయలక్ష్మి, ఏసీఎంవోలు రమేశ్, రాములు, ఏటీడీవో చంద్రమోహన్, భారతీదేవి, క్రీడల అధికారి గోపాలరావు, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

