మణుగూరు టౌన్, ఫిబ్రవరి 28: తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. గుట్ట మల్లారం జీపీఎస్, పగిడేరులోని జీపీఎస్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పిల్లల చేత బోర్డుపై అక్షరమాల, అధికారుల పేర్లు రాయించారు. పిల్లలు రాయడం, చదవడంలో వెనుకబడి ఉన్నారని, బాలశిక్షలోని పాఠ్యాంశాలను చదవడంలో కొందరు పిల్లలు వెనుకబడి ఉన్నారని, పిల్లలందరూ తప్పులు లేకుండా రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన చిన్నారులకు విద్యను బలోపేతం చేయడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఏటీడీవో అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.