బూర్గంపాడు, జూలై 15 : ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్లో త్వరలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ భారత ట్రేడ్ యూనియన్ను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బీఆర్ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన ముఖ్య కార్యవర్గ సన్నాహక సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. ఐటీసీలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూను ఆదరించాలని కోరారు. ఐటీసీలోని కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సానికొమ్ము శంకర్రెడ్డి, మహ్మద్ సాబీర్ పాషా పాల్గొన్నారు.