బోనకల్లు, జులై 04 : రోడ్డు ప్రమాదంలో ఇరిగేషన్ లస్కర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని రావినూతల గ్రామంలో శుక్రవారం జరిగింది. కలకోట గ్రామానికి చెందిన యంగల అప్పయ్య (50) ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లస్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కలకోట గ్రామం నుంచి బోనకల్లులో గల ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయానికి తన బైక్పై బయల్దేరాడు. రావినూతల గ్రామం వద్ద బర్రె బైక్కు తగలడంతో కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన బోనకల్లు సబ్ డివిజన్ డీఈఈ తమ్మరపు వెంకటేశ్వర్లు, ఏఈఈ రాజేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అప్పయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.