ఖమ్మం, జనవరి 25 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు వరల్డ్స్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో రాష్ర్టానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కేటీఆర్‌ను మార్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో మంత్రి పువ్వాడను కేటీఆర్ అభినందించారు. అనంతరం మంత్రి అజయ్‌కుమార్ తన అన్న కుమారుడు నరేన్ వివాహ రిసెప్షన్ ఫిబ్రవరి 10న ఖమ్మంలో జరుగనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.