కూసుమంచి, మార్చి 10: డీసీసీబీ డైరెక్టర్, చేగొమ్మ సహకార సంఘం చైర్మన్ ఇంటూరి శేఖర్ జన్మదిన వేడుకలను గురువారం జీళ్లచెరువులోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మిత్రులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన జన్మదినం సందర్భంగా వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఇంటూరి శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాయకులు, మిత్రులు కలిసి శేఖర్ దంపతులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ ఇంటూరి బేబీ, ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మల్లీడి అరుణ, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, టీఆర్ఎస్ కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల అధ్యక్షులు వేముల వీరయ్య, బెల్లం వేణు, నాయకులు మల్లీడి వెంకన్న, వీరవెల్లి నాగేశ్వరరావు, కంచర్ల వీరారెడ్డి, కార్యదర్శి ఆసీఫ్ పాషా, ఎంపీటీసీ అంబాల ఉమ, బాలాజీ, ఆలయ చైర్మన్ బొడ్డు నరేందర్, చావా ఉమేశ్, ఇంటూరి హరీశ్, నాగినేని తిరుపతి, అజయ్‌కుమార్, కొక్కిరేణి సీతారాములు, తంగెళ్ల బుచ్చిబాబు, అద్దంకి ఉపేంద్రాచారి, తిప్పని అలివేలమ్మ, అక్కినపల్లి వెంకన్న, శ్రీను, గుడవర్తి శ్రీను, కిషన్, కోటి జాదవ్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.