తిరుమలాయపాలెం, మే 25 : న్యాయమైన కోరికల సాధన కోసం గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఐకెపి వీఓఏలు సోమవారం తిరుమలయపాలెంలో వినూత్న నిరసన తెలిపారు. కండ్లకు నల్ల క్లాత్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా వీఓఏల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చొరవ చూపకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి వీఓఏలకు నెలకు రూ.20 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్పుల సుశీల. సంఘం మండల నాయకురాలు అరుణ. ఉమా విజయలక్ష్మి. ఉపేంద్రమ్మ, కృష్ణవేణి, ధనలక్ష్మి పాల్గొన్నారు.