జూలూరుపాడు, జూన్ 25: అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్రకుమార్ మాట్లాడుతూ మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని, అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండుపిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, నాయకులు మధుసూదన్‌రావు, రోశయ్య, చాంద్‌పాషా, గుడిమెట్ల సీతయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.