టేకులపల్లి, మే 24: రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు రావడం ఖాయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌తో కేసీఆర్ మూడోసారీ సీఎం కావడం తథ్యమని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అధికార పార్టీ గెలిచిన దాఖలాలు లేనందున ఈ సారి ఆ చరిత్రను తిరగరాస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మండలంలోని బోడు గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాలో అద్భుత పథకాలు అమలవుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, ఇదంతా సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో ఇల్లెందు నియోజకవర్గం కూడా అగ్రగామిగా ఉందని అన్నారు.
ఈ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రత్యేక అభిమానంతో అత్యధిక నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని అన్నారు. ఎంతో ముఖ్యమైన సీతారామ ప్రాజెక్టు కోసం రూ.3,320 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రజలే బలగమని, ప్రభుత్వ పథకాలే ఆయుధమని అన్నారు. నియోజకవర్గంలో ఇన్నేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గతంలో పార్టీ ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని అన్నారు. వారి మాయమాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు మాధవరావు, హరిసింగ్‌నాయక్, కోటేశ్వరరావు, రాధ, బాలూనాయక్, రామానాయక్, సత్యనారాయణ, శ్యామ్‌బాబు, చంద్రశేఖర్‌రావు, లక్ష్మీనారాయణ, ఉపేంద్రబాబు, మంగమ్మ, విజయ, విజయలక్ష్మి, శాంతకుమారి, మౌలానా, సైదులునాయక్ పాల్గొన్నారు.