ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా తన విజయానికి తోడ్పాటును అందించిన సునీల్ కు తాతా మధు కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ ద్వారా సునీల్ సావలి అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఇండియన్ ఎన్నారైలకు ఎటువంటి సహాయ సహాకారాలు అవసరమైనా ఆయన అండగా నిలుస్తున్నారు.