ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె ఐసీడీఎస్ ఖమ్మం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె తండ్రి ఇదే శాఖలో నాల్గవ తరగతి ఉద్యోగిగా పనిచేసి సర్వీస్‌లో ఉండగానే చనిపోవడంతో కిరణ్మయికి కారుణ్య నియాకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. చిన్న వయస్సులో మృతి చెందడంతో మృతిరాలి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కార్యాలయంలో ఎంతో చురుకుగా పనిచేసే ఉద్యోగి ఆకస్మిక మరణం పట్ల కార్యాలయం ఉద్యోగులు, అధికారులు దిగ్బ్రాంతికి గురయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్ సంద్యారాణీ, అర్బన్ ప్రాజెక్టు అధికారి కవిత, యూడీసీ రవితో పాటు, ఆయా సెక్టార్ల పర్యవేక్షకులు, పలువురు ఐసీడీఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.