ఖమ్మం, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా గులాబీ శ్రేణులు వెళ్లాయి. ఖమ్మం నగరంతో పాటు మున్సిపాలిటీలు, పల్లెల నుంచి వందలాది వాహనాల్లో సభకు వెళ్లారు.
తరలివెళ్లిన వారిలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ మదన్‌లాల్, రాములునాయక్, ఖమ్మం నగర మేయర్ పునకొల్లు నీరజ, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారు. కృష్ణా జలాల పరిరక్షణపై బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది. భవిష్యత్ కార్యాచరణను ఉద్యమ స్ఫూర్తితో విజయవంతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యపాత్ర పోషిస్తామని ప్రతినబూనారు.