Kota Maisamma Jathara | కారేపల్లి : ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర నాలుగో రోజు కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో జాతరకు రద్దీ పెరిగింది. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతర సోమవారంతో ముగియనుంది.
దేవాదాయ శాఖ అధికారులు సోమవారం జాతర హుండీ ఆదాయం లెక్కించనున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చివరి దశకు చేరుకోవడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ జాతర బందోబస్తుకు ఖమ్మం రూరల్ ఏసీపీ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి ఎస్సైలను, సిబ్బందిని వినియోగించారు. పోలీసు అధికారుల నిరంతర నిఘా, పర్యవేక్షణ తో జాతర సాఫీగా సాగింది. జాతరకు శనివారం కురిసిన వర్షం కొంత ఆటంకం కలిగించినా తర్వాత భక్తులు యథావిధిగా జాతరను సందర్శించారు.