బోనకల్లు, ఏప్రిల్ 09 : మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో భూక్య శిరీష – బాలకృష్ణ దంపతులను బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ అనిశెట్టి పున్నం చందర్, ఎంపీడీఓ రమాదేవి మాట్లాడుతూ… సమాజంలో మహిళలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుంటున్నారన్నారు. ఆడపిల్ల జన్మిస్తే భారంగా భావించకుండా బాధ్యతగా పెంచి పోషించి బంగారు భవిష్యత్‌ను కల్పించాలని కోరారు.
ఆడపిల్ల ఉన్న ఇల్లు మహాలక్ష్మి దేవాలయం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి స్రవంతి, ఆర్ఐ మైథిలి, హెల్త్ సూపర్వైజర్ స్వర్ణమార్త, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, నాగమణి, శిరీష, రత్నకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.