కారేపల్లి, జనవరి 26 : ఆటలతో ఆరోగ్యంతో పాటు ఐకమత్యం బలపడుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండల పరిధిలోని తోడితలగూడెం సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసిక శారీరక దృఢంగా ఉంటారన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి చాటుకోవటం ముఖ్యమని క్రీడాకారులకు సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రియాంక కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ్మీర వీరన్న, భూక్యా రాం కిషోర్, వాంకుడోత్ విజయ్, గుగులోతు హరు. రవి, రాహుల్, సుజాత, కళ్యాణ్, సుధాకర్, థామస్ పాల్గొన్నారు.