భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు భద్రాద్రి జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఓసీలను ప్రైవేటుపరం చేసి మెడికల్ బోర్డును లేకుండా చేసినందుకు గాను కార్మికులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ సింగరేణివ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా మంగళవారం జిల్లాకు రానున్నారు.
ఎస్ఐఆర్, బీఆర్ సభ్వత్వ నమోదుపై ఉదయం అశ్వారావుపేటలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం కొత్తగూడెం క్లబ్లో సింగరేణిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధు, తెలంగాణ బొగ్గుగని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పులు ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, ఉద్యమ నాయకులు, ముఖ్య నాయకులు, టీబీజీకేఎస్ రాష్ట్ర కమిటీ నాయకులు హాజరుకానున్నారు.