ఈదురుగాలులతో వడగళ్ల వర్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్రభావంతో కూనారం సమీపంలో మామిడి చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- మణుగూరు టౌన్లో పిడుగుపాటుతో గృహోపకరణాలు దగ్ధం
- దుమ్ముగూడెం దంతెనంలో కొబ్బరి, తాటి చెట్టుపై పిడుగులు
- కోసిన, ఆరబెట్టిన పంటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
మణుగూరు టౌన్/ బూర్గంపహాడ్/ దుమ్ముగూడెం/ పర్ణశాల, మే 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్రభావంతో కూనారం సమీపంలో మామిడి చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అశోక్ నగర్లోని టెలిఫోన్ ఎక్సేంజి వెనుక ఉన్న ఇంటిపై పిడుగుపడింది. ఇంటి దిమ్మె కూలిపోవడంతోపాటు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. బూర్గంపహాడ్ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. సారపాక భాస్కర్నగర్ ఎస్టీ కాలనీలో పెట్టి మధు, హాయ్లాల రత్నం ఇంటి పైకప్పుతో ఉన్న రేకులు ఎగిరిపోవడంతోపాటు ఒక ఇల్లు రేకులతో సహా కూలిపోయింది. గాలిదుమారంతో కురిసిన వర్షంతో నష్టం జరగడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు.
దుమ్ముగూడెం మండలం దంతెనం గ్రామంలో గాలిదుమారంతోపాటు రెండు పిడుగులు పడ్డాయి. గ్రామంలోని మేడిబత్తిని చిట్టయ్య ఇంటి వెనుక తాటి చెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. అదే గ్రామానికి చెందిన వంద వాసు, వశిష్ట, మహాయుని ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవాసులు భయాందోళనకు గురయ్యారు. గాలిదుమారంతో అక్కడక్కడా చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంజుబాక వద్ద నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. రైతులు కోసిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

