భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 8 (నమస్తే తెలంగాణ) /మామిళ్లగూడెం : జిల్లాలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 8,871 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే వారికి హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్ష నిర్వహణకు మొత్తం 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఇప్పటికే స్పష్టం చేశారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాత పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించరు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడంతో అభ్యర్థులు సకాలంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే వారిని బయోమెట్రిక్ ద్వారా పరీక్షించి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
మామిళ్లగూడెం, జూన్ 8 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 52 సెంటర్లు ఏర్పాటు చేయగా, 18,403 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలి. 10 గంటలకు గేట్లు మూసి వేయనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 8,871 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా.. 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి)-552 మంతి, అబ్దుల్‌కలాం ఇంజినీరింగ్ కాలేజీ-ఏ(వేపలగడ్డ)-606 మంది, అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కాలేజీ-బీ(వేపలగడ్డ)-600 మంది, కేఎల్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ(పాల్వంచ)-480 మంది, ఎస్ఆర్ జూనియర్ కాలేజీ(రామవరం ఎస్సీబీ నగర్) 288 మంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పోస్టాఫీస్)-432 మంది, సింగరేణి మహిళా జూనియర్ కాలేజీ(కొత్తగూడెం)-408 మంది, నవభారత్ పబ్లిక్ స్కూల్(పాల్వంచ)-480 మంది, వివేకవర్ధిని డిగ్రీ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి)-408 మంది,
ధన్వంతరి ఫార్మసీ కాలేజీ(సుజాతనగర్)-264 మంది, సెయింట్ మేరీ హైస్కూల్(కొత్తగూడెం)-408 మంది, ఎస్ఆర్ డీజీ స్కూల్(రాంనగర్, విద్యానగర్‌కాలనీ)-504 మంది, గిరిజన బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(నవభారత్)-600 మంది, కృష్ణవేణి జూనియర్ కాలేజీ(లక్ష్మీదేవిపల్లి)-360 మంది, తెలంగాణ శ్రీచైతన్య స్కూల్(లక్ష్మీదేవిపల్లి)-288 మంది, సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీ(కొత్తగూడెం)-528 మంది, సెయింట్ జోసెఫ్ హైస్కూల్(రుద్రంపూర్)-240 మంది, త్రివేణి స్కూల్(లక్ష్మీదేవిపల్లి)-225 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(రుద్రంపూర్)-360 మంది, డీఏవీ పబ్లిక్ స్కూల్(పాల్వంచ)-576 మంది, కేఎల్ఆర్ ఫార్మసీ కాలేజీ(పాల్వంచ)-264 మంది.. మొత్తం కలిపి 8,871 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.