సాగు చేసే రైతులకే ‘రైతుభరోసా’
సాగు చేసే రైతులకే రైతుభరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో, రైతువేదికల్లో రైతుల అభిప్రాయం సేకరించినట్లు చెప్పారు.
- గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద ఎగ్జిట్ పాయింట్ మంజూరు
- వేంసూరు పర్యటనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఎమ్మెల్యేతో కలిసి సొసైటీ పెట్రోల్ బంకు ప్రారంభం
వేంసూరు, జూలై 8: సాగు చేసే రైతులకే రైతుభరోసా అందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనికోసం ఇప్పటికే సహకార సంఘాల్లో, రైతువేదికల్లో రైతుల అభిప్రాయం సేకరించినట్లు చెప్పారు. త్వరలో మంత్రులతో జిల్లాస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వేంసూరులో స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రీన్ఫీల్డ్హైవేను, స్థానికంగా దాని ఎగ్జిట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులు సాగు చేసే పంటలపై ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లితే రైతు నష్టపోకుండా ఉండేలా పంటల బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుందని అన్నారు. రైతుబీమాను సైతం కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉందని, రైతుబీమాకు రూ.2 వేల కోట్ల ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. తనను భుజాలపై ఎత్తుకొని రాజకీయ అక్షరాభ్యాసం నేర్పిన సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. మరో నెలలో వైరా రిజర్వాయర్‌కు, లంకపల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తీసుకొస్తామన్నారు. వచ్చే సంవత్సరం వేంసూరు మండలానికి కూడా గోదావరి జలాలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సైతం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సారయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు దొండపాటి వెంకటేశ్వరరావు, అబీద్ఉర్హ్రమాన్, ఖుర్షిద్, గొర్ల సంజీవరెడ్డి, చల్లగుండ్ల కృష్ణయ్య, పగుట్ల వెంకటేశ్వరరావు, నున్న రాంబాబు, నాయుడు వెంకటేశ్వరరావు, తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, గండ్ర సోమిరెడ్డి, నాని పాల్గొన్నారు.
‘సీతారామ’ కాలువ పనుల పరిశీలన..
వైరా టౌన్, జూలై 8: వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏన్కూరు మండలం ఇమామ్‌నగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పనులను కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి తుమ్మల సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు వేగవంతమయ్యేందుకు ఎక్కువ మొత్తంలో యంత్రాలను వినియోగించాలని సూచించారు. సీపీ సునీల్‌దత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

