ఎర్రుపాలెం, అక్టోబర్ 03 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని సఖినవీడు గ్రామంలో గురువారం మద్యం మత్తులో అమ్మమ్మని మనుమడు తీవ్రంగా కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శాఖముడి పద్మావతి (63) అనే వృద్దురాలిని ఆమె కుమార్తె కొడుకు చీరాల సాయి తల్లిదండ్రులు చనిపోవడంతో తన దగ్గరే ఉంటున్నాడు. మద్యం, గంజాయి, బెట్టింగ్ లకు బానిసై చీరాల సాయి అమ్మమ్మను తలపై ఇనుప రాడ్ తో తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే వైరా ఏసీపీ రెహమాన్, మధిర సీఐ మధు, ఎర్రుపాలెం ఎస్ఐ రమేశ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.