నీలాకాశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగను ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల ఆఫీసులు, సంఘాల కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో, ఐడీవోసీలో, తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం వీపీ గౌతమ్, జిల్లా పరిషత్‌లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పోలీసు కమిషనరేట్‌లో సీపీ సునీల్‌దత్, డీసీసీబీలో సీఈవో రెహమాన్, ఫ్రీడం పార్కులో మేయర్ నీరజ, కేఎంసీలో కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి.