కల్లూరు, నవంబర్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని వెన్నవల్లి సొసైటీ చైర్మన్ నర్వనేని పెద్ద అంజయ్య అన్నారు. గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ దళారులను నమ్మవద్దని, పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఉప్పు సుబ్బారావు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోవాలని జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు అన్నారు. పార్థసారథిపురం, భవన్నపాలెం కేంద్రాలను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసి నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ఏజెన్సీలో రైతులకు పట్టా పాసు పుస్తకాలు లేని వారికి ఏఈవోల ద్వారా టోకెన్లను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌లు కాకా రుద్రజరాణి, పోతురాజు సంధ్యారాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి, నవంబర్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరరావు అన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుప్తా, ఏవో భూక్యా తారాదేవి, ఏఈవో వేదిత, మహేశ్, సొసైటీ ఉపాధ్యక్షుడు కాట్రాల రోశయ్య, తాటిపల్లి నరసింహారావు, ముత్తబోయిన రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.