మధిర, మార్చి 22 : మధిర పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు స్కూలు ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్ బేబీ మెడల్స్ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొవిన్షియల్ సుపీరియల్ సిస్టర్ లిల్లీ కుట్టి, ఆర్సీఎం చర్చి ఫాదర్ శాంతికుమార్, స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సిస్టర్ మేరీ థామస్, స్కూల్ అకాడమిక్ కో ఆర్డినేటర్ వెంకటనారాయణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.