మణుగూరు టౌన్, సెప్టెంబర్ 8: ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే వైద్యరంగం బలోపేతమవుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మెరుగైన సేవల కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ జరుగుతోందని అన్నారు. మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిని శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం బాలింతకు కేసీఆర్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకనే తెలంగాణలో వైద్య విప్లవం ప్రారంభమైందని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ వైద్యశాలలకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నట్లు చెప్పారు.
సమీకృత మార్కెట్ నిర్మాణ పనుల పరిశీలన..
మణుగూరు మండలంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి కాంట్రాక్టర్లను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రకాల వసతులతో సువిశాలమైన ప్రాంగణంలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే, మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బాంబేకాలనీ వరకు రోడ్డు వైడెనింగ్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌ను రూ.9 కోట్లతో చేపడుతుండగా ఆ పనులను కూడా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, అడపా అప్పారావు, ముత్యం బాబు, జావేద్‌పాషా, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, యూసఫ్ షరీఫ్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్, వివిధ శాఖల పాల్గొన్నారు.