చింతకాని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న రైతు అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయనిర్మల శనివారం అన్నారు. మండల పరిధిలో అనంతసాగర్ గ్రామంలో ప్రభుత్వం మంజూరి చేసిన కల్లాలను మండల వ్యవసాయాధికారి పల్లెల నాగయ్యతో కలసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 50చదరపు మీటర్ల కల్లాలకు రూ.56వేలు, 60చదరపు మీటర్ల కల్లాలకు రూ.68వేలు, 75చదరపు మీటర్ల కల్లాలకు రూ.85వేలు మంజూరు చేయనున్నట్లు, ఎస్సీ ఎస్టీ రైతులకు 100శాతం, మిగతా రైతులకు 90శాతం సబ్సీడీ ఇవ్వనున్నామని, పల్లెల్లో సన్నకారు రైతులు, స్వయం సహయక సభ్యులు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన కల్లాలను ప్రతి రైతు ఏర్పాటుచేసుకోని ప్రభుత్వ రాయితీలను పోందాలని కోరారు.
బిల్లులను సైతం వెంటనే మంజూరుచేస్తామని స్ధానిక రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధుసమితి జిల్లాసభ్యులు మంకెన రమేశ్, గ్రామకన్వీనర్ నూతలపాటి వెంకటేశ్వర్లు, సర్పంచ్ నూతలపాటి మంగతాయారమ్మ, వైస్‌ఎంపీపీ గురజాల హనుమంతరావు, డైరక్టర్ నన్నక కోటయ్య, ఉపసర్పంచ్ సారిక వెంకటేశ్వర్లు, జానపాటి ఆదినారాయణ, ఏఈవో శ్రీశత, రైతుబంధుసమితి సభ్యులు, రైతులు పాల్గోన్నారు.