మధిర, డిసెంబర్ 21: అన్ని మతాల ముఖ్య పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, పండుగలకు దుస్తులు పెట్టే సంప్రదాయం కేవలం తెలంగాణలోనే ఉన్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. ముదిగొండలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని మతాలకు, వర్గాలకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, మండల రైతు కన్వీనర్ పోట్ల ప్రసాద్, డీటీ డేవిడ్ కరుణాకర్, సర్పంచ్ లు మందరపు లక్ష్మి, కోటి అనంతరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు మందరపు ఎర్ర వెంకన్న, తోట ధర్మారావు, మీగడ శ్రీనివాస్ యాదవ్, బిక్షం, బంక మల్లయ్య, నీరుకొండ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
కమలమ్మకు నివాళి : సీనియర్ పాత్రికేయుడు మక్కెన నాగేశ్వరరావు తల్లి కమలమ్మకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు నివాళి అర్పించారు. బుధవారం జరిగిన కమలమ్మ సంవత్సరీకంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
మధిరటౌన్, డిసెంబర్ 21: అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ పెద్దపేట వేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. బుధవారం పట్టణంలో ఆయన క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేసి మాట్లాడారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదన్నారు. ఆనందోత్సాహాలతో క్రిస్మస్ను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాస్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, డిసెంబర్ 21: మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు వెంకటేశ్వర్లుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.30వేల చెక్కును జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్ బుధవారం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆళ్ళ పానకాలు, బయ్యన వెంకయ్య, ఖాజామియా, నన్నక వీరయ్య, కాటంనేని నాగేశ్వరరావు, ఆళ్ళ వెంకట్రావు పాల్గొన్నారు.