మణుగూరు టౌన్, జనవరి 21: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని, ఇందుకోసం ఇప్పటినుంచే శ్రమించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. సమితిసింగారం పంచాయతీ జనరల్ బాడీ సమావేశం అశోక్‌నగర్‌లోని గంజి నరేందర్ ఇంటి వద్ద మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సమితిసింగారం పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.
అధిక నిధులు వెచ్చించి సెంట్రల్ లైటింగ్, పలు వీధులలో సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు అన్ని కల్పించామన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు అందరూ పాటుపడాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే విజయం మనదే అవుతుందన్నారు.
సమావేశంలో మండల పార్టీ కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ కుంట లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ పోచం నరసింహారావు, బులిశెట్టి నవీన్, నూకారపు రమేశ్, వట్టం రాంబాబు, ఆవుల నరసింహారావు, ముద్దంగుల కృష్ణ, అక్కి నరసింహారావు, ఎడవల్లి వెంకటయ్య, బేగ రమ్య, ముద్దుల ప్రసాద్, బర్మావత్ నరసింహారావు, వెంకటసోములు, కంభంపాటి ఉపేంద్ర, బోడా బీరమ్మ, గాజుల నరేశ్, గంజి నరేందర్, కర్ల వెంకన్న, సుతారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.