అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వివరాలు వెల్లడించారు.
- రూ.22 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వివరాలు వెల్లడించారు. టీఎస్ ఎస్పీ సత్తుపల్లి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరం లక్ష్మీనారాయణ ఇంట్లో గత డిసెంబర్ 19న చోరీ జరిగింది. ఘటనపై లక్ష్మీనారాయణ సత్తుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశా రు. ఫిర్యాదును ఛాలెంజ్‌గా తీసుకున్న సెంట్రల్ క్రైమ్ టీం, సత్తుపల్లి పోలీసులు విచారణ ప్రా రంభించారు. ఘటనా స్థలాల్లో దొరికిన ఆధారాలతో జిల్లాలను జల్లెడ పట్టారు. ఇటీవల నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని మం చిర్యాల జిల్లా మందమర్రి మండలం మంగనివాడకు చెందిన బీమిలి రాజ్‌కుమార్ అలియాస్ టిల్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామన్ననగర్కు చెందిన నీలాల అనీల్‌కుమార్, తోట నరేష్, హైదరాబాద్‌కు చెందిన మచ్చా ఆదర్స్గా గుర్తించారు. వారి నుంచి 216 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు తొమ్మి ది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నా రు.
రికవరీ చేసిన సొత్తు విలువ రూ.22 లక్షల వరకు ఉంటుంది. నలుగురు నిందితులూ గతంలో బాలనేరస్తులు. జైలు జీవితంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ర్టాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, సూర్యాపేట జిల్లాలోని మోతె, నూతనకల్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం రూరల్, నిడమనూరు, నేరేడుచర్ల, మిర్యాలగూడెం-1, వాడపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఏపీలోని ఏలూరు జిల్లా ఏలూరు-1టౌన్లో రెండు కేసులు, ఏలూరు-3, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కేసులు నమోదయ్యాయి. తాళాలు వేసి ఉన్న ఇల్లు, నిర్మానుష ప్రాంతాల్లో ఉండే ఇళ్లే వీరి టార్గెట్. నిందితులకు గంజాయి రవాణా కేసులతోనూ ప్రమేయం ఉన్నది. ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందించారు. విలేకర్ల సమావేశంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్, సీసీఎస్ ఏసీపీ రవి, సీసీఎస్ సీఐలు బి.బాలాజీ, బి.బాలకృష్ణ, సత్తుపల్లి సీఐ మోహన్‌బాబు, సీసీఎస్ సిబ్బంది మంగిత్యా, గజేంద్ర, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

