మధిర, నవంబర్ 12 : మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి బస్తీ దవాఖానకి మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి బెడ్, ఇతర ఫర్నిచర్‌ను తన తల్లి భద్రమ్మ జ్ఞాపకార్థం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రోగుల కోసం దవాఖానకు ఒక బెడ్‌ను విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ మాట్లాడుతూ.. దాతల సహకారం దవాఖాన సేవలను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ వెంకటేశ్వరరావు, గోవిందు, సరోజినీ, బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ కుసుమ, స్టాఫ్ నర్స్ వెంకట లక్ష్మి, సపోర్టింగ్ స్టాఫ్ విజయకుమార్ పాల్గొన్నారు.