మధిర, ఏప్రిల్ 07 : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మహదేవపురం గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ పుతుంభక సుభాష్ తన తల్లిదండ్రులు, స్వర్గీయ పుతుంభక రామ సీతమ్మ పేరు మీదుగా ఆస్పత్రి నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలం విరాళంగా ఇచ్చారు. సుభాష్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా నేడు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థల దాత మాట్లాడుతూ.. పల్లె దవాఖాన నిర్మాణంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు. అనంతరం స్థల దాతను గ్రామస్తులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పుతుంభాక కృష్ణప్రసాద్, డెంటల్ కౌన్సిల్ అఫ్ ఇండియా వైస్ ప్రసిడెంట్ డాక్టర్ చావా భాస్కర్ రావు, ఫార్మా డైరెక్టర్ నాక్ హైదరాబాద్ డాక్టర్ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్, పుతుంభక పార్వతవర్ధని, కాంగ్రెస్ సీనియర్ నాయుకులు కర్నాటి రామారావు, పుతుంభక హునుమంతరావు, రవికుమార్, పీహెచ్సీ దెందుకురు వైద్యులు పృథ్విరాజ్, ఆరోగ్య సిబ్బంది లంక కొండయ్య, సత్యవాణి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.