కారేపల్లి, సెప్టెంబర్ 11 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తూరు తండా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మాలోత్ సఖ్య తల్లి మాలోత్ కోమటి సంతాప సభకు హాజరై ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడపర్తి శ్రీను ఇటీవల మృతి చెందగా అతని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన నున్నా కాంతయ్య పక్షవాతానికి గురై అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
చీమలపాడు గ్రామానికి చెందిన కట్టెకోల రాంబాయి సంతాప సభకు హాజరై మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాలోత్ శకుంతల, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరవత్ మంగిలాల్, మాజీ సర్పంచులు మాలోత్ కిశోర్, బాణోత్ శంకర్, నాయకులు అజ్మీర వీరన్న, ఆజ్మీరా బిక్కు లాల్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, కాంగ్రెస్ పార్టీ కారేపల్లి టౌన్ ప్రెసిడెంట్ పొలగాని శ్రీనివాస్, సీపీఎం మండల కార్యదర్శి నరేంద్ర, స్థానిక నాయకులు , పాల్గొన్నారు.
Karepally : సింగరేణి మండలంలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటన