కారేపల్లి, జూన్ 26 : కారేపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం పరామర్శించారు. వెంకిట్యాతండాలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోత్ భాస్కర్ సంస్మరణ కార్యక్రమానికి హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యంను అందజేశారు. అదే గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు వాంకుడోత్ గోపాల్ సోదరుడు ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం జర్పుల లాలు ఇంట్లో తేనీటి విందు స్వీకరించారు.
మాజీ ఎమ్మెల్యే వెంట ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ బానోత్ దేవ్లానాయక్, సొసైటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, మాజీ సర్పంచులు బానోత్ శంకర్, భూక్య రంగారావు, గుగులోత్ భగవాన్లాల్, ఇస్లావత్ కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, నాయకులు అడపా పుల్లారావు, బత్తుల శ్రీనివాస్, అజ్మీర వీరన్న, జాల సాంబ, కడారి ఉపేందర్, బుజ్జి, బానోత్ బాలు నాయక్, మాలోత్ శోభన్ బాబు, డాక్టర్ బాబులాల్, జర్పుల జగన్, ఆంగోతు రవికుమార్, బానోత్ ప్రేమ్ కుమార్, బానోత్ వెంకట్రాం, బానోత్ రమేశ్, డిష్ రవి, గుగులోత్ శ్రీను, భూక్య కిశోర్, గుగులోత్ సోనియా పాల్గొన్నారు.