పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన మాజీ జడ్పీటీసీ వాంకుడొత్ జగన్ నాయక్ సతీమణి జమున ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్..
కారేపల్లి, మార్చి 23 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన మాజీ జడ్పీటీసీ వాంకుడొత్ జగన్ నాయక్ సతీమణి జమున ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సోమవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పాత కమలపురంలో గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ తేజవత్ బాబురావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆదే గ్రామానికి చెందిన కట్ల భద్రమ్మ ఇటీవల మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ
ఆయన వెంట ఎంపీటీసీల సంఘం మండల మాజీ అధ్యక్షుడు ధరవత్ పాండ్య నాయక్, మండల రైతుబంధు మాజీ కన్వీనర్ గుగులోత్ శ్రీను, ఇల్లెందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, టీడీపీ పాత కమలాపురం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కొత్త తిరుపతయ్య, కాటన్నీ రామారావు, తోటకూరి తిరుపతయ్య, తోటకూరి వెంకటేశ్వర్లు, కొడిమళ్ల వెంకన్న, కొర్ర నాగేశ్వరరావు, తేజవత్ కిషన్, సపావట్ కోటి, పాతకమలాపురం యూత్ అధ్యక్షుడు భూక్య నందు, భూక్య రవి, శ్రావణ్, రాజేష్, కోటి, దారావత్ వెంకట్, గిరిజన సంఘం నాయకులు భూక్య రాంకిషోర్ నాయక్, బానోతు రాజేష్ నాయక్, ఎన్టీఆర్ సేవా సమితి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త వెంకట్ చౌదరి పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

