కారేపల్లి, జూన్ 26 : కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుతారి మేస్త్రి చిత్తలూరి వీరయ్య కుటుంబ సభ్యులను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ శుక్రవారం పరామర్శించారు. అదేవిధంగా కారేపల్లికి చెందిన ఇందుర్తి సురేందర్ రెడ్డి, బీసీ కాలనీకి చెందిన తెలకలపల్లి శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. అనంతరం భాగ్యనగర్ తండా తదితర గ్రామాలలో పర్యటించారు. ఆయన వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్జీ మాజీ మండల కార్యదర్శి అజ్మీర వీరన్న, ఇల్లెందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి వెంకటేశ్వర్లు, కోటి, రామ్ కిషోర్ నాయక్, కాకాటి సాయి, జహీర్, జూపల్లి అశోక్ పాల్గొన్నారు.

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శ