ఖమ్మం రూరల్ : పాలేరు మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పొందాల అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22వ 26వ డివిజన్ తో పాటు మద్దులపల్లి లో సైతం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత 22వ డివిజన్ సాయి గణేష్ నగర్ లోని కందాల క్యాంపు కార్యాలయంలో కందాల యూత్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్త పిల్లలకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కందాల ఉపేందర్ రెడ్డి ప్రారంభించగా వందలాది మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. అదేవిధంగా దివ్యాంగుల కేంద్రంలో కందాల యూత్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మానసిక దివ్యంగా పిల్లలకు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిల్లలకు పాలు పండ్లు, పుస్తకాలు పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ ప్రతి వేడుక సేవా కార్యక్రమంగా కొనసాగాలని, తద్వారా సమాజ సేవ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుందన్నారు. పుట్టినరోజు పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అభిమానులు పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ తిరుమలయపాలెం కూసుమంచి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, భాష బోయిన వీరన్న, వేముల వీరయ్య, మాజీ జడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, కందాల యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.