వేంసూరు, సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 27 : తనకు రాజకీయ జన్మనిచ్చిన దివంగత సీమం నందమూరి తారక రామారావును మరిచిపోనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా గురువారం లింగపాలెం నుంచి వేంసూరు వరకు అభిమానులు నిర్వహించిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం వేంసూరు ఎన్టీఆర్ కాలనీ వద్ద కాల్వ లో పసుపు కుంకుమ, పూలు చల్లి పూజ నిర్వహించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరిగినా హాజరవుతానన్నారు. కార్యక్రమంలో రైతులు వెల్ది జగన్మోహన్రావు, ఎండీ ఫైజుద్దీన్, తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, మందపాటి వేణుగోపాల్ రెడ్డి, కొత్తూరు ప్రభాకర్‌రావు, బండి గుర్నాథరెడ్డి, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, దుగ్గి అప్పిరెడ్డి, వివిధ ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు.