ఖమ్మం, సెప్టెంబర్ 14 : సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లింబ్ సెంటర్లో 86 మందికి కృత్రిమ కాళ్లను మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పంపిణీ చేశారు. అనేక కారణాలతో కాళ్లు పోగుట్టుకున్న వారికి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా కృత్రిమ కాళ్లు తయారుచేయించి పంపిణీ చేసి వారి ముఖాల్లో నవ్వులు చిందించారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ నాన్న ప్రతి పుట్టినరోజున ఎన్నో పుట్టినరోజు చేసుకుంటారో అన్ని లింబ్స్(కృత్రిమ కాళ్లు) పువ్వాడ ఫౌండేషన్ తరఫున పంపిణీ చేస్తామని అన్నారు. ఖమ్మం రోటరీ క్లబ్ సహకారంతో పువ్వాడ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి ప్రత్యేకంగా తయారుచేయించి ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పుట్టినరోజున రూ.3,44,000 లతో 86 మందికి కృత్రిమ కాళ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. నాన్న ప్రోత్సాహంతో ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారని, తన రాజకీయ గురువు కూడా నాన్నే అని అన్నారు.
కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం మాజీ గవర్నర్ మల్లాది వాసుదేవరావు, డిప్యూటీ గవర్నర్ దొడ్డపనేని సాంబశివరావు, అధ్యక్షుడు నల్లమోతు రవీంద్రనాధ్, సెక్రటరీ హరి శ్రీనివాస్, మేకల భిక్షమయ్య, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, కూరాకుల వలరాజు, నాయకులు వల్లభనేని రామారావు, పౌర సమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్, నగర ప్రచార కార్యదర్శి షకీనా, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, యూత్ అధ్యక్షుడు దేవభక్తిని కిషోర్, ఉస్మాన్, గొల్లపుడి హరికృష్ణ, అబ్బాస్, మోరంపుడి సాయి, విజయ్, అజయ్ పాల్గొన్నారు.