ఖమ్మం/ రఘునాథపాలెం, ఆగస్టు 23: బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం 14వ డివిజన్‌కు చెందిన మార్బుల్ వర్కర్ ఇసంపల్లి శ్రీనివాసరావు ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. అప్పటికే అతడికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉంది. దీంతో అతడి కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైంది.
ఈ మేరకు ఆ చెక్కును మాజీ మంత్రి అజయ్‌కుమార్ శుక్రవారం మృతుడి భార్య ఉపేంద్రమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్ కూరాకుల వలరాజు, బీఆర్ఎస్ నాయకులు జానీ, రామనర్సయ్య, దస్తగిరి, కోటి, నాగరాజు, అశోక్, సతీశ్, వెంకన్న, శరత్ పాల్గొన్నారు.