ఖమ్మం, ఫిబ్రవరి 21 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. వద్దిరాజు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.