ఖమ్మం, జూలై 14 : అనారోగ్యంతో బాధపడుతున్న ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని పువ్వాడ ఇంట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్యం బాగుపడే వరకు ఇతరత్రా పనులు ఏమీ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజయ్‌ను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.