బీఆర్ఎస్ అభ్యర్థికి అధిక మెజార్టీ ఇవ్వాలి
ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ కోరారు.
- గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ
ఖమ్మం, మే 19: ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ కోరారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ముఖ్య కర్యాకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్బీఐటీ కాలేజీ ప్రాంగణంలో పట్టభద్రులతో జరిగే సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు చెప్పారు. పట్టభద్రులందరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేనికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సహా ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

