పాల్వంచ, జనవరి 21 : పాల్వంచ పట్టణంలోని నవభారత్ పబ్లిక్ స్కూల్లో శనివారం అటవీశాఖ 26వ జోనల్‌స్థాయి క్రీడా సాంస్కృతి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో జోనల్లోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి జోన్ అధికారి భీమా ప్రారంభించి మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులు విధి నిర్వహణతోపాటుగా క్రీడా పోటీల్లో కూడా రాణించాలన్నారు.
ఈ క్రీడల వల్ల శారీరక పటు త్వం, క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. అటవీశాఖ అధికారుల కవాతు, గిరిజన నృత్యా లు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎఫ్‌వోలు రంజిత్ నాయక్(కొత్తగూడెం), రవికిరణ్(మహబూబాబాద్), సిద్దార్ధ్ విక్రమ్‌సింగ్(ఖమ్మం), అప్పయ్య అర్బన్(వరంగల్), ఎఫ్‌డీవోలు దామోదర్‌రెడ్డి, తిరుమలరావు, మహ్మద్, బాబు, చంద్రశేఖర్(భద్రాద్రి కొత్తగూడెం), కృష్ణమాచారి, నాగభూషణం, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.