‘హరితం…హతం’పై…. అటవీ శాఖ చర్యలు
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
- చెట్లు నరికిన ఇద్దరిపై కేసు నమోదు
- రూ.20 వేల కలప స్వాదీనం
అశ్వారావుపేట, మే 30 : పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో పోడు వ్యవసాయం చేస్తున్న మడకం చంద్రమ్మకు పట్టా పాసు పుస్తకం జారీ చేసింది. ఈ భూమిలో భారీ వృక్షాలు ఉండడంతో గ్రామానికి చెందిన బత్తుల నాగేశ్వరరావు ఎటువంటి అనుమతులు లేకుండా ఇటీవల యంత్రాలతో తొలిగించారు.
దీనిపై ఈ నెల 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘హరితం…హతం’ శీర్షికన కథనం ప్రచురించింది. అందుకు స్పందించిన అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. పోడు భూమిలో నిబంధనలకు విరుద్దంగా నరికిన నార వేప, తునికి, పాల, తిరుమాను జాతికి చెందిన చెట్లను గుర్తించారు. చెట్ల కొలతలను సేకరించి వాటి విలువను రూ.20,402లుగా నిర్ధారించారు. కలపను స్వాధీనం చేసుకున్నారు. చెట్లు నరికినందుకు పోడు పట్టాదారిణి చంద్రమ్మ, యంత్రాలతో చెట్లు నరికిన బత్తుల నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.
కేసును కోర్టుకు పంపించినట్లు గురువారం ఫారెస్ట్ రేంజర్ మురళీ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అయితే ఘటన జరిగి సుమారు 20 రోజులు దాటినా, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శీర్షిక ప్రచురితమై 11 రోజుల గడిచినా, కేసు నమోదు చేసి 9 రోజులైనా వివరాలు గోప్యంగా ఉండడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సిఫార్సులతోనే కేసు వివరాలు బహిర్గతం చేయండా రహస్యంగా ఉంచారనే అనుమానాలను వెలిబుచ్చుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

