బోనకల్లు, జులై 05 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందపురం( ఏ ) గ్రామానికి చెందిన గీత కార్మికుడు మంద రాములు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతిచెందాడు. రాములు కుటుంబ సభ్యులకు భాగం ఫౌండేషన్ చైర్మన్ రాకేశ్ రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నగదును ఫౌండేషన్ నిర్వాహకుడు రాధాకృష్ణ శనివారం రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే కుటుంబంలోని చిన్నారుల చదువు అవసరాల కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మరికొందరు దాతలు ముందుకొచ్చి చిన్నారుల చదువుకు భరోసా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగం సేవా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.