కారేపల్లి, ఏప్రిల్ 02 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామంలోని బంజారాకాలనీలో గల రామాలయ అభివృద్ధికి మాజీ ఎంపీటీసీ భాగం రూప నాగేశ్వరరావు దంపతులు రూ.25 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ నగదును గ్రామ పెద్దలు గుర్రం నరసయ్య, గుర్రం కిట్టు చేతుల మీదుగా గ్రామంలోని గుడి వద్ద బుధవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగండ్ల సీతయ్య, తాళ్లూరి రాంబాబు, కొండపల్లి ప్రదీప్, నిధికొండ వెంకన్న, అజ్మీర రవి, మోతీలాల్, బానోత్ శ్యామల, అజ్మీర సురేశ్, బానోత్ రవి, అజ్మీర పీక్లా, బానోత్ హిమ్యా పాల్గొన్నారు.